Breaking News

తాళికట్టే సమయానికి వరుడి అరెస్ట్... అసలేం జరిగిందంటే..


సినీఫక్కీలో పోలీసుల ఎంట్రీతో పీటల మీద పెళ్లి ఆగిపోయిన ఘటన జిల్లా రామగిరి మండలంలో వెలుగుచూసింది. వరుడు తాళికట్టే సమయానికి ఓ యువతి పోలీసులతో కలిసి మండపానికి వచ్చింది. పెళ్లికొడుకు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని చెప్పడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. Also Read: రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీకి చెందిన నాగెల్లి సాంబయ్య, స్వరూపరాణి దంపతుల పెద్ద కొడుకు వరుణ్‌కుమార్‌కు నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. శనివారం ఉదయం 9.58 గంటలకు సెంటినరీ కాలనీలో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి శనివారమే ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది Also Read: దీంతో కేసు నమోదు చేసిన ముషీరాబాద్ పోలీసులు వెంటనే రామగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి పోలీసులు వెంటనే పెళ్లి మండపానికి చేరుకుని వరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పెళ్లి ఆగిపోయింది. దీంతో బంధువులంతా తిరిగి వెళ్లిపోయారు. Also Read:


By March 22, 2020 at 10:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/groom-arrested-in-peddapalli-district-over-young-woman-complaint-against-him/articleshow/74756133.cms

No comments