Breaking News

‘పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా’.. గుంటూరు యువకుడికి ఫేస్‌బుక్ ఫ్రెండ్ వేధింపులు


నేటి స్మార్ట్‌ యుగంలో సోషల్‌మీడియా వినియోగించని వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. దాదాపు అందరూ తమ నిత్యజీవితంలో జరిగే ప్రతి ఘటనను సోషల్‌మీడియాలో పంచుకుంటూ లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్పగా ఫీలవుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని మహిళలను వేధిస్తున్న పోకిరీలు అందులో ఎక్కువైపోయారు. సోషల్‌మీడియాను అడ్డం పెట్టుకుని అమ్మాయిలను వేధించడం, ప్రేమపేరుతో మోసగించడం, వారు పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కడం నేడు సాధారణంగా మారిపోయింది. అయితే జిల్లాలో దీనికి రివర్స్‌ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. Also Read: గుంటూరుకు చెందిన ఓ యువకుడు డిగ్రీ (బీఎస్సీ) చదువుతున్నాడు. కొంతకాలం క్రితం వినుకొండకు చెందిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో అతనికి ఫ్రెండ్‌ రిక్వెస్టు పంపగా అతడు ఓకే చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మూడు నెలల పాటు ఛాటింగ్‌ జరిగింది. నెల రోజుల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరింది. అయితే మనం కేవలం స్నేహితులు మాత్రమే, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ ఆ యువకుడు చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ బెదిరించింది. దీంతో భయపడిపోయిన యువకుడు తల్లికి విషయం చెప్పాడు. Also Read: ఒక్కగానొక్క కొడుకు కావడంతో ఆ తల్లి ఆశలన్నీ అతడిపైనే పెట్టుకుని జీవిస్తోంది. సడెన్‌గా ఓ అమ్మాయి చంపేస్తానని బెదిరించడంతో ఆమె కంగారుపడింది. ఆ యువతి తల్లిదండ్రులను కలిసి సమస్య పరిష్కరించుకుందామని వాళ్లని కలిసింది. కూతురిని మందలించాల్సిన వారు ఆమెకే వత్తాసు పలికారు. ‘ మా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడింది. అతడినే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చుంది. కాబట్టి మా అమ్మాయిని మీ అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సింది. లేకపోతే అతడిని చంపేస్తాం’ అంటూ బెదిరించారు. Also Read: తన తల్లి వెళ్లి మాట్లాడినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆందోళన చెందిన ఆ యువకుడు మత్తుమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా యువతి తల్లిదండ్రులు మాత్రం వేధింపులు ఆపలేదు. దీంతో విసుగుచెందిన ఆ తల్లి సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తనగోడు చెప్పుకుంది. తన కుమారుడిని ఆ అమ్మాయి, ఆమె తల్లిదండ్రుల బారి నుంచి కాపాడాలని వేడుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 03, 2020 at 11:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/yound-woman-harassed-degree-student-for-marriage-proposal-via-facebook-in-guntur/articleshow/74453204.cms

No comments