Breaking News

విద్యార్థినులకు సెక్స్ వీడియోలు చూపిస్తూ.. విశాఖలో కీచక టీచర్ దారుణం


విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే కీచకులుగా మారుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. విద్యార్థినులకు సెక్స్ వీడియోలు చూపిస్తూ ఉపాధ్యాయుడు వెకిలి చేష్టలకు పాల్పడుతున్న దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది. అశ్లీల వీడియోలు చూపిస్తూ విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. అనకాపల్లిలో పరిధిలోని ఉడ్‌పేట ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కృష్ణమూర్తి కీచకుడిగా మారాడు. పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్థినులకు సెల్‌ఫోన్లో సెక్స్ వీడియోలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. కీచక టీచర్ వేధింపులు భరించలేకపోయిన ఓ బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. Also Read: విద్యార్థినుల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్న కీచక టీచర్ కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:


By March 06, 2020 at 01:24PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/school-teacher-sexual-harassment-on-girl-students-in-visakhapatnam/articleshow/74507726.cms

No comments