Breaking News

మహిళా రోగిపై లైంగిక వేధింపులు.. హైదరాబాద్‌లో డాక్టర్‌పై కేసు


అనారోగ్యంతో బాధపడుతూ వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళను లైంగికంగా వేధించిన డాక్టర్‌పై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. పాతబస్తీ ప్రాంతానికి చెందిన వివాహిత అనారోగ్యానికి గురికావడంతో ఈ నెల 9వ తేదీన డాక్టర్‌కు వద్దకు వెళ్లింది. కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ ఆమెకు రాసివ్వగా టోలిచౌకిలోని ఆర్పీస్కేన్ అండ్ ల్యాబ్‌కు వెళ్లింది. అక్కడ డాక్టర్ జిలానీ ఆమెకు రక్త పరీక్షలు చేసి రిపోర్టు ఇచ్చాడు. Also Read: అయితే ప్రిస్ర్కిప్సన్‌‌పై ఉన్న ఫోన్ నంబర్‌ను సేకరించిన డాక్టర్ ఆమెకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. తన కోరిక తీర్చాలంటూ, తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వేధించాడు. ఆమె అంగీకరించకపోవడంతో వాట్సాప్‌లో కరోనా వైరస్‌ మెసేజ్‌లతో పాటు అశ్లీల ఫొటోలు పంపించాడు. దీంతో బాధితురాలి ఈ విషయాన్ని భర్తకు చెప్పగా అతడు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డాక్టర్ వేధింపుల కారణంగా తన భార్య డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందని, అతడిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో గోల్కొండ అడిషనల్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్‌ డాక్టర్ జిలానీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By March 23, 2020 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-old-city-doctor-booked-over-sexual-harassment-on-married-woman/articleshow/74766201.cms

No comments