Breaking News

‘భీష్మ’ రీమేక్‌లో బాలీవుడ్ ప్లే బాయ్


‘భీష్మ’ నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ఇంట్రస్ట్ చూపిస్తోంది. వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు హీరోలు సైతం మెచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లో కూడా రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ‘భీష్మ’ ను రిమేక్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్‌ను పెట్టి తీయాలనుకుంటున్నాడని బాలీవుడ్ టాక్. ఇప్పటికే విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా రైట్స్ కూడా కరణ్ జోహార్ వద్దే ఉన్నాయి. రణ్ బీర్ కపూర్ ప్రస్తుతం లవ్ రంజన్, బ్రహ్మస్త్ర, షమ్ షేరా సినిమాలో నటిస్తున్నాడు. బ్రహ్మస్త్రలో బిగ్ బీత పాటు... రణ్ బీర్ ప్రియురాలు ఆలియా భట్ కూడా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ‘బ్రహ్మస్త్ర’ విడుదల కానుంది. ఇక షమ్ షేరా సినిమాలో వాణికపూర్ రణ్ బీర్‌తో జత కట్టింది. ఈ సినిమా ఏడాది జూలై 31న విడుదల కానుంది. ఇక శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా లవ్ రంజన్ తెరకెక్కుతుంది.ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానుంది. ఈ మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీ ... తెలుగులో బాగా ఆడిన సినిమాల్ని రిమేక్ చేసే పనిలో పడింది. తెలుఇగులో సూపర్ హిట్ అయిన సినిమాల్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు అక్కడి దర్శక నిర్మాతలు. 'అర్జున్ రెడ్డి' అక్కడి 'కబీర్ సింగ్' గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పడు 'జెర్సీ' .. 'ఆర్ ఎక్స్ 100' చిత్రాలు కూడా హిందీ రీమేక్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ ‌లోకి నితిన్ 'భీష్మ' కూడా చేరిపోయింది. మరి ఇక్కడ హిట్ అయిన సినిమా బాలీవుడ్‌లో ఎలా ఉంటుందో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.


By March 23, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/karan-johar-to-remake-nithin-bheeshma-movie-in-bollywood/articleshow/74768179.cms

No comments