Breaking News

15 మందికి కరోనా వచ్చిందంటూ ప్రచారం.. మహిళ అరెస్ట్


కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని పోలీసులు, ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు మూర్ఖుల్లో మార్పు రావడం లేదు. తాజాగా రాజధాని కోల్‌కతాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్‌మీడియాలో వదంతులు వ్యాప్తి చేస్తున్న మహిళను పోలీసుల అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జ్యోతీష్‌రాయ్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ నయాఅలీపూర్‌ ప్రాంతంలో 15 మందికి కరోనావైరస్‌ పాజిటివ్‌ తేలిందని, ఆ విషయాన్ని ప్రభుత్వం దాచి పెట్టిందంటూ అసత్య సమాచారాన్ని వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేసింది. Also Read: దాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన వారు ఆ వార్తకు సంబంధించి సాక్ష్యాలు తెలుపమని సదరు మహిళను ప్రశ్నించారు. ఆమె తెల్లముఖం వేయడంతో అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సోషల్ మీడియాలో ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేసే ఎవరినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరోనాపై ఇటువంటి వదంతులు వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో వాట్సాప్‌ సంస్థ స్టేటస్‌ సమాయాన్ని 15 సెకన్లకు తగ్గించింది. ట్విటర్ సైతం ఎవరైనా తప్పుడు సమాచారంతో ట్వీట్ చేస్తే వెంటనే దాన్ని డిలీట్ చేసేస్తోంది. ఇటీవల పవన్‌కళ్యాణ్, రజనీకాంత్ ట్వీట్లను కూడా అదే విధంగా తొలగించిన సంగతి తెలిసిందే. Also Read:


By March 31, 2020 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-arrested-in-kolkata-over-allegedly-spreading-fake-news-on-coronavirus/articleshow/74904740.cms

No comments