Breaking News

కరోనా విజృంభణ.. స్వీయ నిర్బంధంలో 100 కోట్ల మంది


ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 3లక్షల మందికి పైగా సోకింది. ఇప్పటికే 13వేల మందికి పైగా ప్రజలు దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో ప్రస్తుతం రెండో దశలో ఉన్న ఈ వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. దీన్ని నివారించే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం దేశమంగా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వల్ల సుమారు 100 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. Also Read: 35 దేశాల్లో సుమారు 100 కోట్ల మంది శనివారం తమ ఇళ్లకే పరిమితమయ్యారని నిపుణులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య 13 వేలు దాటిపోవడంతో ఒక్కటొక్కటిగా దేశాలు తమ ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తుండటమే దీనికి కారణం. ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ 4 కోట్ల మంది ప్రజల్ని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం నిర్బంధించింది. ఇప్పుడు దాని బాటలోనే న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌ రాష్ట్రాలు సైతం ప్రజలను కఠిన ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నాయి. కరోనా వైరస్ పెద్ద వయస్కులకు మాత్రమే సోకుతుందని, తమకు ఇబ్బందేమీ ఉండదని యువత నిర్లక్ష్యం చేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అనవసరంగా చిక్కుల్లో పడొచ్చని చెబుతోంది. Also Read:


By March 22, 2020 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/100-crore-people-self-quarantine-in-the-world-over-corona-virus-effect/articleshow/74755792.cms

No comments