Breaking News

Rajkumar: చిరంజీవి తొలి సినిమా దర్శకుడు కన్నుమూత


1979లో వచ్చిన ‘పునాదిరాళ్లు’ సినిమాలో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నంది అవార్డు దక్కించుకుంది. అయితే ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్‌కుమార్ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే చాలా ఏళ్ల పాటు రాజ్‌కుమార్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారట. అప్పట్లో ఆయన ఆర్థిక కష్టాల్లో ఉన్నారని వార్తలు రావడంతో ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి స్పందించి డబ్బుసాయం చేసారు. రాజ్‌కుమార్‌ .. 1977లో ‘పునాదిరాళ్లు’కు కథ రాసుకోగా, 1978లో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఎలాగోలా సినిమా రిలీజ్‌ చేయగా 5 నంది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత ‘ఈ సమాజం నాకొద్దు, మన ఊరి గాంధీ, మా సిరిమల్లెతో కలిపి దాదాపు ఎనిమిది సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. READ ALSO: సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, గీత రచయితగా, కథా రచయితగా పని చేసినా ఇప్పటికీ ఫిల్మ్‌నగర్‌లో గానీ, చిత్రపురి కాలనీలో గానీ ఆయనకు సొంతిల్లు లేదు. దీంతో అద్దె ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. పైసా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లేకపోవడంతో రెండో కొడుకు కష్టంతో బతుకు వెళ్లదీసారు.


By February 15, 2020 at 11:53AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-starrer-punadhirallu-director-rajkumar-dies/articleshow/74146122.cms

No comments