COVID-19గా కరోనా వైరస్.. 1100 దాటిన మరణాలు
కారణంగా మరణించిన వారి సంఖ్య 1100 దాటింది. ప్రపంచ వ్యాప్తంగా 44 వేల మందికిపైగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. వీరిలో 8 వేల మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అని పిలుస్తుండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధికి ఓ పేరు పెట్టింది. దీన్ని COVID-19 (కరోనా వైరస్ డిసీజ్ 2019) అని పిలవాలని ప్రతిపాదించింది. గత ఏడాది చివర్లో ఈ వ్యాధి మొదలు కావడంతో.. సీవోఐడీ-19 అని పిలవాలని నిర్ణయించారు. కరోనా వైరస్‌కు సంబంధించి ఉన్న భయాలను పోగొట్టడం కోసమే ఈ పేరు పెట్టామని.. దీనికి ప్రజలు, జంతువులు, ప్రదేశాలతో సంబంధం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఘేబ్రెయెసస్ తెలిపారు. అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం వ్యాధి పేరు పెట్టేటప్పుడు.. ఏ భౌగోళిక ప్రాంతానికి, జంతువులకు, వ్యక్తులకు సంబంధం లేకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అది వ్యాధికి సంబంధించినదై.. తేలికగా పలికేలా ఉండాలని టెడ్రోస్ తెలిపారు. చైనా వ్యాప్తంగా గత 24 గంటల్లో 97 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారని, 2015 కొత్త కేసులు నమోదయ్యాయని బుధవారం చైనా అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది హుబేయ్ ప్రావిన్స్‌కు చెందిన వారే. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య చైనాలో 1,113కి చేరింది. కరోనా కేసుల సంఖ్య 44,653కి చేరింది.
By February 12, 2020 at 08:27AM
No comments