Breaking News

అనసూయపై వల్గర్ ట్వీట్... అందులో తప్పేముంది అంటున్న ట్విటర్ అధికారులు


ప్రముఖ యాంకర్ అనసూయకు పలువురు నెటిజన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. Actress masala అనే అకౌంట్‌ ద్వారా ఓ నెటిజన్ అనసూయపై, సినీ నటి అనుష్కపై వల్గర్ ట్వీట్స్ పెట్టాడు. ఆ ట్వీట్‌ స్క్రీన్‌షాట్స్ తీసి ఇలాంటి అకౌంట్స్‌పై చర్యలు తీసుకోవాలని ట్విటర్ నిర్వాహకులను కోరారు. అయితే వారి నుంచి అనసూయకు ఊహించని పరిణామం ఎదురైంది. ‘‘మీరు ఇచ్చిన ఫిర్యాదుపై మేం దర్యాప్తు చేస్తాం. మాకు ఇందులో తప్పేమీ కనిపించడంలేదు. ఒకవేళ మీకు తప్పు ఉందని మీకు అనిపిస్తే ఏం జరిగిందో మాకు తెలియజేయండి’’ అని రిప్లై ఇచ్చారు. దాంతో ఇక అనసూయ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాలని అనుకున్నారు. తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్న ట్వీట్‌ను, కంప్లైంట్ చేస్తే ట్విటర్ ఇచ్చిన రిప్లైను స్క్రీన్‌షాట్ తీసి సైబర్ క్రైం పోలీసులకు పంపించారు. ‘డియర్ ట్విటర్ సపోర్ట్.. దయచేసి మీ రూల్స్‌లో కొన్ని మార్పులు చేసుకోండి. ఇది ట్విటర్ వైలేషన్ కాకపోతే మరేంటి? దీనిని సైబర్ క్రైంగా పరిగణించకపోతే మీదే తప్పు అని చెప్పడానికి కూడా నేను వెనుకాడను. దయచేసి ఈ ట్వీట్స్‌పై చర్యలు తీసుకోవడానికి సరైన అధికారులను ట్యాగ్ చేయాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులను కోరుకుంటున్నాను’ అని అనసూయ మండిపడ్డారు. READ ALSO: మొన్న కూడా ఎవరో తన ఫొటోను మార్ఫ్ చేశాడంటూ అనసూయ ఫైర్ అయ్యారు. దాని అసలు ఫొటోనే ఈ చీరకట్టులో ఉన్న ఇమేజ్ అని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘హలో!! నా ఇమేజ్‌ను మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు ఇమేజ్‌ను ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా నా మార్ఫ్‌డ్ ఇమేజ్‌ను చూస్తే దయచేసి దాన్ని పోస్ట్ చేసిన ఫ్రొఫైల్ గురించి నాకు చెప్పండి’’ అని అనసూయ తన అభిమానులను కోరారు. ఇంతకీ, ఆ మార్ఫ్‌డ్ ఇమేజ్ ఏమిటో, దాన్ని ఎలా మార్ఫ్ చేశారో చేసినవాళ్లకే తెలియాలి. READ ALSO:


By February 10, 2020 at 11:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-anasuya-bharadwaj-complains-to-cyber-crime-police-for-vulgar-tweets-on-her/articleshow/74058154.cms

No comments