Breaking News

ఎన్ఆర్‌సీపై కేంద్రం కీలక ప్రకటన


జాతీయ పౌర జాబితాపై () కేంద్రం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తామని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటనను వివిధ రాష్ట్రాలు తప్పుబట్టాయి. ఈ క్రమంలోనే , ఎన్‌ఆర్‌సీపై చర్చ జరపాలని గత రెండు రోజుల నుంచి విపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. Also Read: దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు విధానం గురించి ఇప్పటి వరకు తాము ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లిఖితపూర్వకంగా లోక్‌సభకు సమాధానం ఇచ్చారు. 130 కోట్ల భారతీయులకు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే.. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌ఆర్‌సీపై ఎక్కడా చర్చలు జరగలేదని సమాధానంలో పేర్కొన్నారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈశాన్య రాష్ర్టాల్లో ఎన్ఆర్‌సీ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. Also Read: సీఏఏ, ఎన్‌ఆర్‌సీ దేశ వ్యాప్తంగా అమలు చేస్తారా లేదా? అని గత రెండు నెలల నుంచి నిరసనలు చేస్తున్న వాళ్లంతా కేంద్ర హోంశాఖ మంత్రి తాజాగా చేసిన ప్రకటనతోనైనా శాంతించాలని తాము భావిస్తున్నట్లు వివరించారు. సీఏఏపై ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడా సంప్రదించి చర్చిస్తున్నామని చెప్పారు. ప్రజల్లో సీఏఏపై ఉన్న భయాందోళనను పరిష్కరిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పారు. Also Read: Must Read:


By February 04, 2020 at 01:50PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/union-minister-nityanand-rai-announces-key-statement-on-nrc/articleshow/73930513.cms

No comments