ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ టీచర్ దారుణహత్య.. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి


జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కొందరు దుండగులు ఆదివారం అర్ధరాత్రి దారుణంగా చంపేశారు. లచ్చిగూడెంలోని నాగన్నగుంపునకు చెందిన కారం చిన్న రామకృష్ణ(35) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం ఆయన స్థానిక ఎంఈవో కార్యాలయంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్(సీఆర్సీ)గా పనిచేస్తున్నారు. Also Read: ఆదివారం రామకృష్ణ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల లోపలికి చొరబడి గొంతు కోసి చంపేశారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన భార్యపై కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అక్కడ గుమిగూడారు. ఈలోగా దుండగులు ఇంటి వెనుక నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. భూ వివాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:
By February 10, 2020 at 09:00AM
No comments