Breaking News

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు.. 14 మృతి


ఉత్తరప్రదేశ్‌లో బుధవారం అర్ధరాత్రి ఘోర సంభవించింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఆగి ఉన్న లారీని ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి బీహార్‌లోని మోతీహరీ వెళ్తున్న డబుల్ డెక్కర్ ప్రయివేట్ బస్సు.. వద్ద స్టేషనరీ లోడ్‌తో ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయానికి బస్సులో 40 నుంచి 45 మంది ప్రయాణికులు ఉన్నారు. రహదారిపై లారీ ఆగి ఉన్న విషయాన్ని గమనించని బస్సు డ్రైవర్.. వేగంగా వెళ్లి దానిని ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని, 14 మంది అక్కడికక్కడే మృతిచెందారని తెలిపారు. గాయపడినవారిలో మరో 10 నుంచి 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఫిరోజాబాద్‌లోని సైఫై మినీ పీజీఐకి తరలించారు. నాగ్లా ఖంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ఫిరోజాబాద్‌ (రూరల్) ఎస్పీ రాజేశ్ కుమార్ తెలిపారు. బస్సు ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తోందని, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు వివరించారు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు నిర్ధారించారు. ట్రక్‌లోని బస్సు దూసుకెళ్లడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ క్రేన్ సాయంతో బస్సును లారీ నుంచి వేరుచేశారు. రెండు వాహనాల మధ్య మృతదేహాలు చిక్కుకుని నుజ్జునుజ్జయ్యాయి.


By February 13, 2020 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-14-killed-several-injured-in-road-accident-due-to-bus-truck-collision-in-ups-firozabad/articleshow/74109431.cms

No comments