Breaking News

Yesudas Songs: సుస్వర ప్రవాహం `యేసుదాసు`కు పుట్టినరోజు శుభాకాంక్షలు


కట్టస్సేరి జోసెఫ్ .. ఈ పేరు కొత్తగా అనిపించినా సినీ సంగీతంతో ఏ మాత్రం పరిచయం ఉన్న ఆయన వారికి సుపరిచితుడే. సినిమా పాటకు సమున్నత గౌరవం తెచ్చిపెట్టిన అతి కొద్ది మంది కళాకారుల్లో ఒకరాయన. భక్తిపాటలైన, ప్రేమ గీతాలైన, విరహ గీతాలైన ఆయన గొంతు నుంచి పలికితే ఆ అక్షరాలు అద్భుతంగా మారిపోతాయి. ఆయన దేశ గర్వించదగ్గ గాయకుడు కేజే ఏసుదాసు. దాదాపు ఐదు దశాబ్దాలుగా స్వర ప్రయాణం కోనసాగిస్తున్న జేసుదాసు మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, ఒరియా, బెంగాలీ లాంటి దేశ భాషలతో పాటు అరబిక్‌, ఇంగ్లీష్‌, లాటిన్‌, రష్యన్‌ భాషల్లో కలిసి దాదాపు 80 వేల పాటలు పాడారు. వీటిలో సినీ గీతాలతో పాటు ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ కూడా ఎన్నో ఉన్నాయి. శబరిమల క్షేత్రంలో అయ్యప్ప పవళింపు సేవ సందర్భంగా యేసుదాసు ఆలపించిన హరివరాసనం పాటను వినిపిస్తారు. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలకు గాను ఏకంగా ఎనిమిది జాతీయ పురస్కారాలు ఆయన్ను వరించాయి. పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ లాంటి అవార్డులు ఆయన కీర్తి కిరీటంలో చేరి మరింత గౌరవాన్ని పొందాయి. శుక్రవారం ఈ మహాగాయకుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన స్వరం నుంచి పలికిని కొన్ని ఆణిముత్యాలను గుర్తు చేసుకుందాం.


By January 10, 2020 at 01:42PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/legendary-singer-kj-yesudas-birthday-special-songs/articleshow/73185918.cms

No comments