Breaking News

ఉల్లి కోసం లొల్లి.. వ్యాపారి తల పగులగొట్టిన కస్టమర్!


ఆకాశాన్ని అంటిన ధరలతో ఉల్లి.. ప్రతి రోజూ ఏదోరకంగా వార్తల్లో నిలుస్తోంది. కోసం భారీ క్యూ లైన్ల నుంచి దొంగతనాల వరకు చూసేశాం. తాజాగా, ఉల్లి కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరగ్గా.. అది తలలు పగులగొట్టకునే వరకు వెళ్లింది. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సార్‌ నగర్‌ ఎస్సై భాస్కర్‌రావు తెలిపిన వివరాల మేరరకు.. యూసుఫ్‌గూడ సమీపంలోని రహమత్‌నగర్‌కు చెందిన వీరన్న ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం బాపూనగర్‌ చౌరస్తాలో చాట్‌ బండి వద్దకు వెళ్లి నిర్వాహకుడు సర్దార్‌ పవార్‌ను పానీపూరీ ఇవ్వాలని అడిగాడు. ఆయన ఉల్లిపాయలు లేకుండా పానీపురీ ఇచ్చాడు. Also Read: దీంతో ఉల్లిపాయలు లేకుండా పానీపూరీ ఏంటని వీరన్న ప్రశ్నించాడు. ‘ఉల్లిపాయలు వేసేందుకు బిర్యానీకి ఏమైనా ఆర్డర్ ఇచ్చావా’ అని సర్దార్ హేళగా మాట్లాడాడు. దీంతో వీరన్న అక్కడే పానీపూరీని వదిలేశాడు. ఉల్లి ధర ఎక్కువగా ఉందని పవార్‌ చెప్పినా వీరన్న వినిపించుకోలేదు. అయితే పానీపూరీ తిన్నా, తినకున్నా బిల్లు రూ.10 చెల్లించాల్సిందేనని పవార్‌ చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో విసుగెత్తిన పవార్‌ ఆటో డ్రైవర్‌పై దాడి చేశాడు. కోపం పట్టలేని వీరన్న ఆటో నుంచి రాడ్డు తీసుకుని సర్దార్‌ తలపై మోదాడు. దీంతో చుట్టుపక్కల జనాలు గుమిగూడారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలకు తీవ్ర గాయాలైన సర్దార్‌ పవార్‌ను ఆస్పత్రికి తరలించి.. ఆటో డ్రైవర్‌ వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. Also Read:


By January 01, 2020 at 12:44PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/dispute-for-onion-customer-attack-on-head-to-panipuri-vendor-in-hyderabad/articleshow/73055608.cms

No comments