Breaking News

ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని రోకలి బండతో కొట్టి చంపిన భర్త


పచ్చని కాపురంలో అనుమానం పెనుభూతమైంది. దీనికి ఆస్తి తగాదాలూ తోడయ్యాయి. మద్యం మత్తులో మృగంగా మారిన భర్త ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న భార్యన కిరాతకంగా చంపేశాడు. విశాఖ జిల్లా పాయకరావుపేటలోని చక్కానగర్‌లో బుధవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. Also Read: కె.మేరీ కమలక్ష్మి(48) అనే మహిళ పాయకరావుపేటలోని నాగనరసింహ ప్రాథమిక పాఠశాల (మెయిన్‌)లో టీచర్‌గా పనిచేస్తోంది. భర్త శోభన్‌రాజ్‌, ఇద్దరు పిల్లలతో కలిసి చుక్కానగర్‌లోని సొంతింట్లో నివాసముంటున్నారు. కుమారుడు బీటెక్‌ పూర్తి చేయగా, కుమార్తె బీటెక్‌ చదువుతోంది. మేరీని అనుమానం పెంచుకున్న శోభన్‌రాజ్ ఆమెను తరుచూ వేధింపులకు గురిచేసేవాడు. ఆస్తి విషయంలోనూ ఇద్దరి మధ్య విభేదాలున్నాయి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మేరీ మంగళవారం పిల్లలతో కలిసి చర్చికి వెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. Also Read: కాసేపటి తర్వాత దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో శోభన్‌రాజ్ రోకలిబండతో మేరీ తలపై బలంగా కొట్టాడు. ఆమె అరుపులు విన్న కుమారుడు, పక్కన అద్దెకు ఉంటున్న వారు వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను వాహనంలో విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడు ప్లాన్ ప్రకారమే భార్యను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించరు. కేసు నమోదు చేసుకుని శోభన్‌రాజ్‌ కోసం గాలిస్తున్నారు. Also Read:


By January 02, 2020 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/school-teacher-murdered-by-husband-vizag-district/articleshow/73064948.cms

No comments