వణికిన వరంగల్.. మాంసం కొట్టే కత్తితో యువతి గొంతుకోసిన ఉన్మాది
తాను ప్రేమించిన యువతి మరొకరితో సన్నిహితంగా ఉంటోందన్న కోపం, త్వరలో పెళ్లి చేసుకోబోతుందన్న ఆక్రోశంతో ఓ ఉన్మాది పాశవికచర్యకు పాల్పడ్డాడు. మాంసం కొట్టే కత్తితో యువతి గొంతు కోసి పాశవికంగా చంపేశాడు. రక్తం మడుగులో కొట్టుకుంటున్నా కనికరించకుండా అక్కడి నుంచి నేరుగా ఇంటికెళ్లి స్నానం చేసి మరీ పోలీసుల ఎదుట స్వయంగా లొంగిపోయాడు. ఒళ్లుగగుడ్పొడిచే ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రాంనగర్ పరిధి క్రాంతినగర్‌లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం పెద్దగా మారి ఆ యువతి హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. Also Read: డిగ్రీలో క్లాస్‌మేట్స్ లష్కర్ సింగారానికి చెందిన మునిగాల ప్రదీప్, రేణుక దంపతులకు ముగ్గురు సంతానం. ప్రదీప్.. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్‌గా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నాడు. పెద్ద కూతురికి వివాహం కాగా, కుమారుడు ప్రణీత్ నాలుగేళ్ల కిందట రాంపూర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న కూతురు హారతి (27) డిగ్రీ పూర్తి చేసి స్థానికంగా ఓ కాలేజీలో ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది. అయితే హారతి హన్మకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్‌జీ కాలేజీలో డిగ్రీ చదువుతుండగా.. కాజీపేట విష్ణుపురికి చెందిన ఎండీ షాహిద్ (28)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ గ్రూప్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అయితే షాహిద్ డిగ్రీ ఫెయిల్ కావడంతో కాజీపేటలో తన తండ్రి నిర్వహిస్తున్న మటన్‌షాపులోనే పనిచేస్తున్నాడు. Also Read: అద్దె గదికి పిలిపించి..హన్మకొండలోని రాంనగర్‌లో హారతి సోదరి నివాసముంటున్న ఇంటి సమీపంలోనే 6 నెలల క్రితం షాహిద్ ఓ గదిలో అద్దెకు దిగాడు. ఆ గదికి నెలలో రెండు, మూడు సార్లు మాత్రమే వచ్చి పోయేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అద్దె మాత్రం ప్రతి నెలా చెల్లించేవాడు. ఈ గదికే శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేసి హారతిని పిలిపించాడు. ఈ నేపథ్యంలో ముందుగానే షాహిద్ దగ్గర మటన్ కత్తి ఉండటంతో ప్లాన్ ప్రకారమే హారతి గొంతు కోసి హత్య చేశాడు. ఆమె రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా గదికి తాళం వేసి.. ముందువైపు ఉన్న గేటులో నుంచి కాకుండా పక్కనున్న మరో గేటులో నుంచి నిందితుడు వెళ్లిపోయాడు. Also Read:
By January 11, 2020 at 11:48AM
No comments