Allu Arjun: `అల వైకుంఠపురములో` తొలి షో పడేది ఎక్కడంటే?
స్టైలిష్ స్టార్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా . బన్నా లాంగ్ గ్యాప్ తరువాత నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుండటంతో సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలకు పర్మిషన్ రావటంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే బన్నీ సందడి మొదలవ్వనుంది. ఇక ఓవర్‌సీన్‌లో మరో 12 గంటలు ముందుగానే ప్రీమియర్స్ షో పడనున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. Also Read: అయితే ఈ సినిమా తొలి షో పడేది ఎక్కడ అన్న చర్చ మొదలైంది. బన్నీ అల వైకుంఠపురములో తొలిసారిగా దర్శనమిచ్చేంది మలేషియాలో. మలేషియాలోనే ఫెడరల్ సినిమాస్‌లో ఈ మూవీ తొలి షో పడనుంది. శనివారం (జనవరి 11) సాయంత్రం 7 గంటలకు ఫెడరల్ సినిమాల్లో అల వైకుంఠపురములో ఫస్ట్ షో ప్రారంభం కానుంది. అదే ఈ మూవీ అఫీషియల్‌గా ప్రదర్శిచనున్న తొలి షో. బన్నీ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆడియో సూపర్ హిట్ కావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ సినిమాను అల్లు అరవింద్, రాధకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. Also Read:
By January 10, 2020 at 10:02AM
No comments