కర్నూలు జిల్లాలో వ్యభిచారం గుట్టురట్టు.. పోలీసులు అదుపులో 8మంది

జిల్లాలో ఆలూరు పట్టణంలో గుట్టుగా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఓ పాఠశాల పక్కనున్న ఇంట్లో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతోంది. ఆ ఇంటికి రోజూ యువకుల తాకిడి పెరగడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడ రైడ్ నిర్వహించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు విటులు, ముగ్గురు వేశ్యలు ఉన్నారు. Also Read: ఆలూరుకు చెందిన ఐదుగురు యువకులు గుంతకల్లు ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం ఆలూరు పట్టణంలో ప్రచారం కావడంతో ప్రజలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఆలూరు పట్టణంలో వ్యభిచారం కేసులో అరెస్టులు కావడం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడూ ఇలాంటి కేసులు నమోదు కాలేదు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ సెక్స్ రాకెట్ వెనుక సూత్రధారులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. Also Read: రెండు నెలలుగా ఈ వ్యవహారం జరుగుతున్నా ఎందుకు వెలుగులోకి రాలేదన్న అనుమానం అందరికీ కలుగుతోంది. పట్టణంలో ఇంకా ఎక్కడైనా వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని పూర్తిస్థాయిలో విచారిస్తే తెరవెనుక విషయాలు కూడా తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. Also Read:
By January 03, 2020 at 08:27AM
No comments