జూబ్లీహిల్స్‌లో రేవ్ పార్టీ భగ్నం.. అర్ధనగ్నంగా డ్యాన్సులు.. 21 మంది యువతుల అరెస్ట్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని టాట్ పబ్‌లో గుట్టుగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు చేధించారు. పబ్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్నారన్న సమాచారంతో ఆదివారం రాత్రి వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులతో పాటు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు సంయుక్తంగా ఏకకాలంలో దాడులు చేశారు. ఓ ప్రైవేటు సంస్థ ఈ పబ్‌లో ప్రత్యేకంగా రేవ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. Also Read: పబ్‌లో అర్ధరాత్రి భారీగా శబ్దాలు రావడం, డీజే సౌండ్ ఎక్కువగా ఉండడంతో స్థానికులు కొందరు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. దీంతో పబ్ వద్దకు చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూడగా పలువురు యువతులు అర్ధనగ్నంగా కనిపించారు. దీంతో పోలీసులు 21 మంది అమ్మాయిలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వీరిలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రసాద్ అనే ఈవెంట్ మేనేజర్ కోసం వారిని రప్పించినట్లు తెలుస్తోంది. పోలీసుల తనిఖీకి రాగానే ప్రసాద్ పరారైనట్లు సమాచారం. Also Read: పట్టుబడిన యువతులపై ఐపీసీ సెక్షన్ 294 కింద కేసులు నమోదు చేస్తామని డీఐ రవికుమార్ తెలిపారు. వారికి నోటీసులు ఇచ్చి స్వస్థలాలకు పంపిస్తామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పబ్‌ను సీజ్ చేసినట్లు వెల్లడించారు. పార్టీలో మైనర్లు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు ఈ ఆపరేషన్‌ను వీడియో తీస్తున్న సమయంలో యువతులు మీడియా ప్రతినిధుల మీద దాడికి ప్రయత్నించారు. వారి కెమెరాలు లాక్కుని వీడియో ఎందుకు తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read:
By January 13, 2020 at 08:06AM
No comments