పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం.. నెల్లూరు కామాంధుడికి పదేళ్ల జైలు

యువతిని బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి న్యాయస్థానం శిక్ష విధించింది. జిల్లా మండలం పూరి పాళెం గ్రామానికి చెందిన బండి ఆదెయ్యకు 10ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ. 20వేల జరిమానా విధిస్తూ 8వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి. సత్యనారాయణ సోమవారం తీర్పుచెప్పారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరి అయిన యువతి చిల్లకూరు మండలం కమ్మవారిపాళెంలో చిన్నాన్న వద్ద ఉంటుండేది. 2012, నవంబర్ 29న ఆరోగ్యం బాగోలేకపోవడంతో చిన్నాన్నతో కలిసి గూడూరుకు బైక్‌పై బయలుదేరింది. Also Read: కాస్త దూరం వెళ్లాక ఆయన ఫోన్ మరిచిపోయానని తిరిగి ఇంటికి వెళ్లాడు. దీంతో యువతి రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తోంది. ఇది గమనించిన కమ్మవారి పాళెంలో బేల్థారి పనికి వెళుతున్న ఆదెయ్య ఆమెను బెదిరించి దగ్గరలో ఉన్న పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. కాసేపటి తర్వాత తిరిగొచ్చిన చిన్నాన్నకు యువతి విషయం చెప్పడంతో ఆయన చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏడేళ్ల పాటు సాగిన విచారణలో నేరం రుజువు కావడంతో అదెయ్యను కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. Also Read:
By December 31, 2019 at 02:45PM
No comments