Breaking News

విదేశీ మహిళలతో వ్యభిచారం.. ముంబైలో బ్యాంకు ఉద్యోగి అరెస్ట్


విదేశీ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న నదీమ్‌ఖాన్(26) అనే వ్యక్తి అధిక సంపాదన కోసం నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దందాపై ఎన్నో ఫిర్యాదులు అందుకున్న పోలీసులు గుట్టురట్టు చేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. Also Read: ఓ పోలీసు నదీమ్‌ఖాన్‌ను ఫోన్ చేసి అమ్మాయి కావాలని కోరడంతో అతడు సరేనన్నాడు. తన వద్ద ఉబ్జెకిస్థాన్ అమ్మాయిలు ఉన్నారని, వారితో ఎంజాయ్ చేయడానికి ఒక్క రాత్రికి రూ.60వేలు చెల్లించాలని చెప్పాడు. దీనికి అతడు సరేననడంతో అడ్వాన్స్ తీసుకుని మలాడ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న హోటల్‌కు రావాలని సూచించాడు. అక్కడికి వెళ్లిన వ్యక్తిని మదీన్ ఖాన్ ఇద్దరు ఉబ్జెకిస్థాన్ అమ్మాయిలను చూపించాడు. ఎవరు కావాలో ఎంపిక చేసుకోవాలని చెప్పడంతో అతడు ఓ అమ్మాయితో గదిలోకి వెళ్లాడు. Also Read: అక్కడి నుంచి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్ బ్రాంచ్ స్పెషల్‌ టీమ్‌ హోటల్‌పై రైడ్ చేసింది. ఇద్దరు విదేశీ మహిళలతో పాటు సెక్స్ రాకెట్ నిర్వాహకులు నదీమ్‌ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బ్యాంకులో పనిచేసున్న నదీమ్ ఖాన్ నాలుగేళ్లుగా వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. విదేశీ మహిళలను టూరిస్ట్ వీసాపై ముంబయికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నాడని పోలీసుల తెలిపారు. అతడు ఇప్పటివరకు ఎంతమంది మహిళలను వ్యభిచార కూపంలోకి దించాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By December 03, 2019 at 11:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-busted-in-mumbai-bank-employee-arrested/articleshow/72343537.cms

No comments