సమయం లైవ్ న్యూస్: దిశ హత్య: మరో షాకింగ్ న్యూస్.. ఏపీలో మరో రివర్స్ టెండరింగ్

⍟ దిశ కేసులో నిందితుల దారుణాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆమెను హత్యచేసిన తర్వాత పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు ఇప్పటివరకు చెబుతున్నారు. కానీ, ఆమె బతికుండగానే సజీవదహనం చేసినట్లు చర్లపల్లి జైల్లో ఉన్న కీలక నిందితుడు ఆరిఫ్ కొందరు కిందిస్థాయి అధికారులకు చెప్పిన విషయం బయటకు వచ్చింది. చర్లపల్లి జైలులో ఉన్న నిందితులతో కొంతమంది జైలు సిబ్బంది మాట్లాడినప్పుడు ఆరిఫ్ కనీసం భయపడకుండా పలు విషయాలు బయటపెట్టినట్లు అత్యంత విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ⍟ జగన్ సర్కార్ మరోసారి రివర్స్ టెండరింగ్‌తో డబ్బు ఆదా చేసింది. పోలవరం, వెలిగొండతో పాటూ మరికొన్ని పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్‌తో సక్సెస్ కావడంతో.. ఈసారి స్మార్ట్ ఫోన్‌ల కొనుగోలుకు సంబంధించి మళ్లీ ఈ విధానాన్ని అమలు చేసింది. ⍟ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణకు అనంతపురంలో చేదు అనుభవం ఎదురైంది. అనంతపురంలోని నారాయణ విద్యాసంస్థలను పరిశీలించేందుకు నారాయణ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకున్నారు. ⍟ సూర్యాపేట జిల్లా ఇమాంపేటకు చెందిన మునగాల జానయ్య అనే యువకుడు.. సూర్యాపేట పట్టణంలో ఓ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి చెందిన గుండ్లగాని సాయితో అతడికి పరిచయం ఏర్పడింది. అనతి కాలంలోనే వారి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
By December 04, 2019 at 08:40AM
No comments