Breaking News

పార్కులోనే బాలికపై అత్యాచారం.. హైదరాబాద్‌లో ఆటోడ్రైవర్ అరెస్ట్


ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్‌ను హైదరాబాద్‌ లంగర్‌హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్వాన్‌, సబ్జీమండి ప్రాంతానికి చెందిన సల్మాన్‌(20) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అత్తాపూర్‌లో నివాసముండే అతడు లంగర్‌హౌస్‌-పురానాపూల్‌ మార్గంలో ఆటో నడుపుతాడు. లంగర్‌హౌస్‌ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక పనికి వెళ్తూ గత కొన్నినెలలుగా లంగర్‌హౌస్‌ నుంచి పురానాపూల్‌ వరకు సల్మాన్‌ ఆటోలోనే ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. Also Read: బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న సల్మాన్ ప్రేమిస్తున్నానంటూ ఆమెను నమ్మించాడు. నవంబరులో సాయంత్రం వేళ అత్తాపూర్‌లోని ఓ పార్కులోకి తీసుకెళ్లి... పెళ్లి చేసుకుంటానని నమ్మించి అక్కడే పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో నవంబర్ 30 కర్ణాటకలోని గుల్బర్గా తీసుకెళ్లి లాడ్జిలో మరోసారి అత్యాచారం చేశాడు. అయితే ఆ రోజు రాత్రయినా తమ కూతురి ఇంటికి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుల్బర్గా వెళ్లి బాలికను రక్షించారు. పోలీసుల రాకను గమనించిన సల్మాన్ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం లంగర్‌హౌస్ బస్‌స్టాప్‌లో ఉండగా సల్మాన్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By December 12, 2019 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/auto-driver-rapes-minor-girl-on-pretext-of-marriage-in-hyderabad-park/articleshow/72484213.cms

No comments