Breaking News

హైదరాబాద్‌లో వివాహిత అనుమానాస్పద మృతి


హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె భర్త తరఫు వారు ఆత్మహత్యగా చెబుతుండగా, తల్లిదండ్రులు మాత్రం అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. Also Read: సీఐ గంగారెడ్డి, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా ఆలేరు బొమ్మలూరుకు చెందిన మహేశ్వరి (28)కి హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన వెంకటేశ్‌గౌడ్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. అయితే కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్దలు తలెత్తడంతో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేశ్వరి శనివారం ఉదయం ఇంట్లో ఉరికి వేలాడుతూ శవంగా కనిపించింది. Also Read: భర్తే చంపేశాడంటున్న కుటుంబసభ్యులు అయితే మహేశ్వరి మృతికి భర్త వెంకటేశ్‌గౌడే కారణమని, అతనే హత్య చేసి చేసుకుందని చిత్రీకరిస్తున్నాడని మహేశ్వరి కుటంబ సభ్యులు ఆరోపించారు. వెంకటేష్ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని మహేశ్వరిని వేధించేవాడని పేర్కొన్నారు. వెంకటేశ్‌ వేధింపుపై గతంలో పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. Also Read:


By December 22, 2019 at 12:47PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-suspicious-death-in-hyderabad/articleshow/72923227.cms

No comments