‘ఫోటోలు వైరల్ చేస్తానన్నందుకే అతడితో వెళ్లా’ పోలీసులకు చెప్పిన మౌనిక

హిమాయత్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఇంజినీరింగ్ చదువుతూ లేఖ రాసి కనిపించకుండా పోయిన మౌనిక ఉదంతంలో రోజుకో కొత్త ట్విస్ట్ బయటకు వస్తోంది. ఓ యువకుడు తనను వేధిస్తున్నాడని.. హుస్సేన్‌సాగర్‌ల దూకి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి వెళ్లిపోయిన మౌనికను పోలీసులు గుంటూరులో అదే యువకుడితో కలిసి పట్టుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అతడితో ప్రేమ పెళ్లి చేసుకునేందుకు ఆమె నాటకమాడినట్లు అంతా అనుకున్నారు. అయితే పోలీసుల విచారణలో మౌనిక మరిన్ని ఆసక్తిరకమైన విషయాలు చెప్పి అందరికీ షాకిచ్చింది. Also Read: మౌనిక, యువకుడిది నిజామాబాద్ జిల్లా నవీపేట గ్రామం. ఇద్దరికీ బాల్యం నుంచే పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకుని కలిసి తిరిగారు. ఆ సందర్భంలో ఫొటోలు కూడా తీసుకున్నారు. కొంతకాలానికి మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఉన్నత చదువుల నిమిత్తం ఆ మౌనిక హైదరాబాద్‌కు వచ్చి హాస్టల్‌లో ఉంటూ నారాయణగూడలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది. ఆ అబ్బాయి కూడా హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేయడానికి నగరానికి వచ్చాడు. మళ్లీ ప్రేమించుకుందామంటూ ఆమెను వేధించసాగాడు. తరుచూ ఫోన్లు చేస్తూ.. కాలేజీకి, హాస్టల్‌కు వచ్చి వేధించేవాడు. Also Read: తనను ప్రేమించకపోతే గతంలో తీసుకున్న ఫోటోలు సోషల్‌మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని మౌనికను బెదిరించడంతో ఆమె ట్యాంక్‌బండ్‌లో దూకి చచ్చిపోదామని నిర్ణయించుకుని లేఖ రాసి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే తన బాల్య స్నేహితుడికి వీడియోకాల్ చేసి చనిపోతున్నానని కూడా చెప్పింది. ట్యాంక్‌బండ్‌పై ఆత్మహత్యకు యత్నించడంతో వాకర్స్ అడ్డుకున్నారు. తర్వాత తనను వేధిస్తున్న అబ్బాయి రూమ్‌కి వెళ్లి ఫోన్లో పోటోలు డిలీట్ చేసింది. Also Read: అయితే అతడు మరో ఫోన్లో కూడా ఫోటోలు ఉన్నాయని, తనను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక అతడితో వెళ్లింది. అక్కడ ఇద్దరూ పెళ్లికి ఏర్పాటు చేసుకుంటున్న సమయంలోనే పోలీసులు ఆచూకీ కనుక్కుని పట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. వారిద్దరిని సోమవారం హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు వేర్వేరుగా విచారించారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు. Also Read:
By December 03, 2019 at 10:43AM
No comments