Breaking News

బన్నీతో డ్యాన్సా.. ‘వామ్మో’ అనేసిన హీరోయిన్!


టాలీవుడ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ డ్యాన్స్‌లో నెంబర్ వన్ హీరోలు. ఒకరు ఎక్కువా కాదు ఒకరు తక్కువా కాదు.. ఆ రేంజ్‌లో ఉంటాయి వాళ్ళ డ్యాన్స్‌లు. అయితే ఎన్టీఆర్ కథకి అనుగుణంగా సినిమాలో డ్యాన్స్‌లు లేకపోయినా సర్దుకుపోతాడేమో గాని.. అల్లు అర్జున్ మాత్రం తన సినిమాల్లో ఫ్యాన్స్‌కి మెచ్చే స్టెప్స్ ఖచ్చితంగా ఉండాలని కోరుకోవడమే కాదు... కొత్త మాస్ స్టెప్స్ కోసం ట్రై చేస్తుంటాడు. అందుకే చాలామంది హీరోయిన్స్.. బన్నీతో డ్యాన్స్ చేయడానికి భయపడుతుంటారు. పూజ, తమన్నా లాంటి వాళ్ళు అల్లు అర్జున్‌తో డ్యాన్స్ కంఫర్ట్‌గా ఉంటుంది కానీ.... ఎన్టీఆర్‌తో కాస్త భయమంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ రిహార్సల్స్ చెయ్యకుండానే సెట్ పైకి వెళ్ళిపోతాడట.

అయితే బన్నీతో డ్యాన్స్ చేస్తే కాళ్ళు విరగ్గొట్టుకోవాలంటూ ఓ యంగ్ హీరోయిన్ చేసిన కామెంట్స్ మాత్రం బన్నీ ఫ్యాన్స్‌కి పిచ్చ సంతోషాన్నిస్తున్నాయి. ఒకప్పుడు రాజ్ తరుణ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి.. మధ్యలో కనబడకుండా వెళ్లి మళ్ళీ రాజుగారి గది 3తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్‌ని ఓ మీడియా వ్యక్తి.. మీకు అల్లు అర్జున్‌తో డ్యాన్స్ వేసే ఛాన్స్ వస్తే ఏం చేస్తారు అని అడగగా.. దానికి అవికా గోర్ షాకవడమే కాదు.... వామ్మో.. అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేసి కాళ్ళు విరగ్గొట్టుకోమంటారా.. అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేయడం చాలా కష్టమని నవ్వుతూ చెప్పేసింది. మరి నిజంగానే అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్ వెయ్యాలి అంటే.. హీరోయిన్స్ వణకాల్సిందే కదా..!



By December 05, 2019 at 02:33AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48566/allu-arjun.html

No comments