సీఎం జగన్ ఇలాకాలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. హెచ్‌ఎంపై వేటు

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కడప జిల్లా పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణానాయక్‌పై వేటు పడింది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అదే పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల ప్రధానోపాధ్యాయుడు కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఆరోపణలు వచ్చాయి. Also read: ఈ ఘటన విద్యాశాఖలో కలకలం రేపడంతో ఆయన్ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు ఎంఈవో వీరారెడ్డి తెలిపారు. కృష్ణానాయక్‌పై విచారణ చేసి నిజానిజాలు నిర్ధారణ చేస్తామన్నారు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై హెచ్‌ఎం కృష్ణానాయక్‌పై కేసు నమోదు చేసినట్లు పులివెందుల సీఐ భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని, తల్లిదండ్రులు సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Also read: కొన్ని నెలలుగా హెచ్‌ఎం తనను పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడని, కోరిక తీరిస్తే మార్కులు బాగా వేస్తానని వేధిస్తున్నాడని బాలిక ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. హెచ్‌ఎం వేధింపులు ఎక్కువ కావడంతో తమ కూతురు స్కూల్‌కి వెళ్లేందుకు భయపడుతోందని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. Also read:
By December 03, 2019 at 08:37AM
No comments