Breaking News

ప్రియురాలిని లొంగదీసుకునేందుకు బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. కడప యువకుడి నిర్వాకం


ప్రియురాలు తాను చెప్పినట్లుగా వినడం లేదన్న అక్కసుతో ఓ యువకుడు నీచానికి పాల్పడ్డాడు. యువతి స్నానం చేస్తుండగా సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసుందుకు యత్నించాడు. ఆమె సకాలంలో అప్రమత్తం కావడంతో అతడి దుర్మార్గం బయటపడింది. Also Read: జిల్లా మండల పరిధిలోని శెట్టిగుంట పంచాయతీకి చెందిన ఓ గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన యువతీయువకుడు కొంతకాలం ప్రేమించుకున్నారు. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. అయితే ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదన్ని అక్కసుతో ఆ యువకుడు ఓ ప్లాన్ వేశాడు. ఆమె ఇంట్లోని బాత్‌రూమ్‌లో పెన్ కెమెరా ఏర్పాటు చేశాడు. Also Read: రెండ్రోజుల క్రితం యువతి స్నానానికి వెళ్లినప్పుడు సీక్రెట్ కెమెరాను గుర్తించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. అయితే ఈ వివాదంలోకి కులపెద్దలు ప్రవేశించి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారు. యువకుడి వద్ద పెన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నామని, అయితే అది పనిచేయడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఆ యువకుడు బాత్‌రూమ్‌లో కెమెరా పెడతానని బెదిరింపులు మాత్రమే చేశాడని, కానీ ఆ యువతి ముందుగానే ఆందోళన పడి తల్లిదండ్రులకు చెప్పిందన్నారు. ఇరువర్గాలు రాజీపడటంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. Also Read:


By December 13, 2019 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kadapa-man-try-to-film-girl-friend-bath-scene-police-under-investigation/articleshow/72504026.cms

No comments