Breaking News

సమయం లైవ్ న్యూస్: నిందితుల ఎన్‌కౌంటర్.. దిశను హత్యచేసిన చోటే ప్రతీకారం


దిశ నిందితుల ఎన్‌కౌంటర్: హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. హత్యాచార ఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. దిశను సజీవదహనం చేసిన చోటే నిందితులు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ⍟ అదే స్పాట్‌లో ఎన్‌కౌంటర్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యకేసు నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. క్రైమ్ సీన్‌లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో నిందితుల్ని తొండుపల్లి టోల్‌గేట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నలుగురు నిందితులు పోలీసుల్ని తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను అత్యంత పాశవికంగా ఎక్కడైతే చంపారో అదే స్పాట్‌లోనే నలుగురు ఎన్‌కౌంటర్‌‌కు గురయ్యారు. ⍟ దిశ మొబైల్ దొరికిందిలా: దిశ హత్యాచార ఘటన తర్వాత కనిపించకుండా పోయిన బాధితురాలి సెల్ ‌ఫోన్‌ను సంఘటనా స్థలంలోనే పాతి పెట్టినట్లు నిందితులు వెల్లడించారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఘటనా స్థలం నుంచి సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ లిస్ట్, కాల్ రికార్డులు తదితర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తద్వారా మరిన్ని కీలక ఆధారాలు సేకరించే అవకాశం ఉంది.


By December 06, 2019 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-6th-december-2019/articleshow/72393417.cms

No comments