Breaking News

ఆ విమర్శల కారణంగానే థమన్‌లో మార్పు!!


ఒకప్పుడు థమన్ మ్యూజిక్ అంటే.. రొటీన్ అనే నానుడి ఉండేది. ఎందుకంటే థమన్ మ్యూజిక్ వస్తుంది అంటే... అది రొటీన్‌కే రొటీన్ అన్నట్టుగా ఉంటుందని మ్యూజిక్ లవర్స్ ఫిక్స్ అయ్యేవారు. కానీ నేడు థమన్ సంగీతం ఓ క్రేజ్, ఓ బ్లాక్ బస్టర్, ఓ సంచలనం అన్న రేంజ్‌లో ఉంది. థమన్ సంగీతంలో కొత్తదనం తొణికిసలాడుతుంది. మంచి హుషారెత్తించే బీట్స్‌తో థమన్ మ్యూజిక్ బ్యాండ్ దంచి కొడుతోంది. తొలిప్రేమ, అరవింద సమేత సినిమాల దగ్గరనుండి థమన్ మ్యూజిక్‌లో స్టయిల్ మారిపోయింది. ఆ సినిమాల హిట్‌తో థమన్ వెనక్కి తిరిగి చూసుకోకుండా అవకాశాల మీద అవకాశాలతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఏ సినిమా ఓపెనింగ్ చేసినా మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ పేరే. అయితే అంతలా ఫామ్ లోకి రావడానికి కారణం ఏమిటో థమనే స్వయంగా చెప్పుకొచ్చాడు. ‘‘బోయపాటితో చేసిన సరైనోడు సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత తన మీదొస్తున్న కామెంట్స్‌కి ఎలాగైనా బదులు చెప్పాలని డిసైడ్ అయిన థమన్...ఒక ఏడాది గ్యాప్ తీసుకుని, తనని తాను మార్చుకోవాలని అనుకున్నాడట. అనుకున్నట్లే ఆలోచించి ఆలోచించి అసలు ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి పాటలను కంపోజ్ చేయాలి, అలాగే మ్యూజిక్‌లో ఎలాంటి ట్యూన్స్ ని మ్యూజిక్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడతారనే దానిమీద ఆలోచించే టైములో తొలిప్రేమ లాంటి మూవీ రావడం ఆ సినిమాతో థమన్ సెటిల్ కావడం జరిగాయట. తనపై వచ్చిన విమర్శల కారణంగానే తాను మళ్ళీ కొత్తగా మారానని చెబుతున్నాడు థమన్.



By December 05, 2019 at 10:44PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48580/ss-thaman.html

No comments