అక్కను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన చెల్లెలి రేప్.... గుల్బర్గాలో పట్టుబడిన హైదరాబాద్ రేపిస్ట్

నిజాంపేటలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై చేసి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వైపు ‘దిశ’ ఘటనపై నగరంలో ఆందోళనలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: నిజాంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అక్కాచెల్లెళ్లు నివాసముంటున్నారు. వీరిలో అక్కకి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని నదిపాలేం గ్రామానికి చెందిన జయచంద్ (29) పరిచయం అయ్యాడు. వివాహం చేసుకుంటానని నమ్మించిన ఆమెను నమ్మించిన జయచంద్.. నవంబర్ 30వ తేదీన హైదరాబాద్ వచ్చి వారి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో యువతి ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లిడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అయిన ఆమె చెల్లి ఒంటరిగా ఉంది. Also Read: ఈ విషయాన్ని పసిగట్టిన జయచంద్ ఆమెను బెదిరించి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆమె మెడలోని బంగారు గొలుసు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్న అక్క చెల్లెలి పరిస్థితి చూసి షాకైంది. బెడ్‌పై నగ్నంగా పడివున్న ఆమెను చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్న నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి నుంచి గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. Also Read:
By December 05, 2019 at 08:24AM
No comments