Breaking News

వాచ్‌మెన్ భార్యతో అఫైర్.. ప్రియురాలి భర్తను బీదర్ తీసుకెళ్లి పెట్రోల్ పోసి సజీవదహనం


వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ రిటైర్డ్ ఉద్యోగి ప్రియురాలి భర్తను అతి కిరాతకంగా చంపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో నుంచి కర్ణాటకలోని బీదర్‌కు తీసుకెళ్లి ప్రాణం తీశాడు. కృష్ణా జిల్లా బొమ్మలపాడుకు చెందిన నాగరాజు(35) 12 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చాడు. తొలుత ప్రగతినగర్‌లోని ప్రశాంతి గోల్డెన్‌ హిల్స్‌లో ఉండే రిటైర్డ్‌ ఉద్యోగి వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో నాగరాజు వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలోనే అతడి భార్య హేమలతతో వెంకటేశ్వర‌రెడ్డి పెట్టుకున్నాడు. నాగరాజును తరుచూ ఏదొక పనిమీద బయటికి పంపుతూ హేమలతతో రాసలీలలు సాగించేవాడు. Also Read: కొద్దిరోజుల తర్వాత ఈ విషయం తెలుసుకున్న నాగరాజు అక్కడ పనిమానేసి ఎలీప్‌ పారిశ్రామికవాడకు మకాం మార్చాడు. అయినప్పటికీ హేమలత అక్రమ సంబంధం మానకపోవడంతో మద్యానికి బానిసై తరుచూ భార్యతో గొడవపడేవాడు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడికి చెప్పి బాధపడేది. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న నాగరాజును అడ్డు తొలగించుకోవాలని వెంకటేశ్వర‌రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఈ నెల 10న తన ఇంటికి నాగరాజును పిలిపించుకుని మద్యం తాగించాడు. Also Read: తర్వాత అతడిని కారులో కర్ణాటకలోని బీదర్ సమీపంలో గల బాల్కి ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ నాగరాజు గొంతు నులిమి చంపేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రే ఇంటికి వచ్చేశాడు. మరుసటి రోజు తన భర్త కనిపించకపోవడంతో హేమలత ప్రియుడి దగ్గరకు వెళ్లి ఆరా తీయగా అక్కడికి రాలేదని చెప్పాడు. అయితే కొందరు స్థానికులు ముందురోజు రాత్రి నాగరాజు, వెంకటేశ్వరరెడ్డి కారులో కలిసి వెళ్తుండగా చూశామని చెప్పడంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. Also Read: అయితే ఈ ఘటనలో నాగరాజు భార్య హేమలత పాత్ర కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హేమలత, వెంకటేశ్వర రెడ్డి ఇద్దరూ కలిసి ఈ హత్యకు కుట్ర పన్నారా..? లేదా వెంకటేశ్వర రెడ్డి హేమలతకు తెలియకుండానే నాగరాజును హత్య చేశాడా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి భార్య హేమలత ప్రస్తుతం బాచుపల్లి పోలీసుల అదుపులో ఉంది. నాగరాజు హత్యకు గురైనట్లు తేలడంతో పోలీసులు బుధవారం రాత్రి బీదర్‌ సమీపంలోని ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. Also Read:


By December 13, 2019 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabd-old-man-kills-his-lovers-husband-due-to-illegal-affair-in/articleshow/72505948.cms

No comments