ఐటీబీపీ జవాన్ కాల్పులు.. ఐదుగురు సహచరులను కాల్చి చంపి, ఆత్మహత్య!

ఛత్తీస్‌గఢ్‌లో ఇండో టిబెటన్ పోలీసుల మధ్య జరిగిన అంతర్గత ఘర్షణలో ఆరుగురు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నారాయణ్‌పూర్ జిల్లాలోని కదేనార్ క్యాంపులో చోటు చేసుకుంది. ఓ వివాదం విషయమై కానిస్టేబుల్ ఆగ్రహానికి లోనై.. సహచరులపై కాల్పులకు దిగినట్టు సమాచారం. అనంతరం తాను కూడా కాల్చుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఐటీబీపీ జవాన్లు చనిపోయిన విషయాన్ని నారాయణ్‌పూర్ ఎస్పీ మోహిత్ గార్గ్ ధృవీకరించారని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. కాల్పులకు దిగిన జగన్‌ను అడ్డుకోబోయిన మిగతా జవాన్లకు కూడా ఈ ఘటనలో గాయలైనట్టు తెలుస్తోంది. గాయపడిన ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
By December 04, 2019 at 11:41AM
No comments