Fatehpur Sikri: వేరే పెళ్లి చేసుకున్నాడని ప్రియుడిని చంపేసిన వివాహిత

కొన్నాళ్లుగా తనతో శారీరక సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి వేరే పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఓ మహిళ అతడిని హత్య చేసింది. నిందితురాలికి అంతకుముందే పెళ్లయి భర్త, పిల్లలుండటం గమనార్హం. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేపూర్‌సిక్రీలో చోటుచేసుకుంది. Also Read: ఈ ఏడాది సెప్టెంబర్ 29న ఫతేపూర్ సిక్రీలోని కారవాన్ సారై మెమోరియల్ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఆ మరుసటి రోజు అతడి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని పంజాబ్‌కు చెందిన ముక్త్సర్ బటిండాగా గుర్తించారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు. Also Read: ఫతేపూర్ సిక్రీకి చెందిన రాజా అనే వ్యక్తి భార్య నాథూతో కలిసి నివసించేవాడు. అతడి పక్కింట్లోనే పంజాబ్‌కు చెందిన ముక్త్సర్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది, వారిద్దరు చాలాకాలం పాటు శారీరక సంబంధాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ముక్త్సర్ తన స్వస్థలానికి వెళ్లిపోయి పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించాడు. అయితే ప్రియుడికి దూరమైన నాథూ అతడిని దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి విఫలమైంది. దీంతో తనను పట్టించుకోని ప్రియుడు బతికుండకూడదని భావించి చంపేయాలని నిర్ణయించుకుంది. Also Read: పథకం ప్రకారం నాథూ సెప్టెంబర్ 29న ముక్త్సర్‌ను ఏదో పని ఉందని చెప్పి తన ఇంటికి రప్పించుకుంది. తనతో శారీరక సంబంధం కొనసాగించాలని అతడిని వేడుకుంది. దీనికి ముక్త్సర్ ససేమిరా అనడంతో మాటల్లో పెట్టి అతిగా మద్యం తాగించింది. అతడు మత్తులోకి జారుకోగానే మరో నలుగురితో కలిసి అతడి గొంతు కోసి చంపేసింది. శవాన్ని ఓ చోట పడేసి ముఖం కనిపించకుండా బండరాయితో కొట్టి చిధ్రం చేసింది. మృతుడి కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నాథూపాటు మిగిలిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By November 06, 2019 at 08:58AM
No comments