Chandrababuకు సూడోలాజియా ఫెంటాస్టికా, దీని లక్షణాలివే: విజయసాయి

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్సీపీ ఎంపీ మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను నేనే నిర్మించా అని చంద్రబాబు పదే పదే చెప్పుకోవడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తుఫాన్ ఎక్కడ తీరం దాటుతుందనేది నాకు ముందే తెలుసని గతంలో బాబు చేసిన వ్యాఖ్యలను సైతం ప్రస్తావించిన విజయసాయి.. సుడోలాజియా ఫెంటాస్టికా అనే మానసిక రుగ్మత వల్లే టీడీపీ అధినేత ఇలా అయిపోయారని ఎద్దేవా చేశారు. తర్కానికి అందని కోతలు కోయడం దీని లక్షణమేనని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధనను అమల్లోకి తీసుకురావాలని జగన్ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేయగా.. ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం ప్రతి విద్యార్థి హక్కు అని విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో మాత్రమే బోధన జరగాలనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని వైఎస్ఆర్సీపీ ఎంపీ చెప్పారు. బలహీన వర్గాల వారిని ఇంకా ఎంత కాలం మీ పిల్లలు, మనవళ్లు చదువుకునే ఆంగ్ల మాధ్యమానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తారు బాబూ? అని ఆయన టీడీపీ అధినేతను ప్రశ్నించారు.
By November 11, 2019 at 01:22PM
No comments