Breaking News

జబర్దస్త్: నాగబాబు స్థానంలో వచ్చేది వీరేనా?


ఈటీవీలో పాపులర్ అయిన జబర్దస్త్.. ఇప్పుడు కష్టాల్లో పడింది. జబర్దస్త్ జడ్జ్ దగ్గర నుండి.. జబర్దస్త్ కమెడియన్స్ వరకు ఈటీవీకి బాగా దెబ్బేసారు. నాగబాబు తనకి కావాల్సిన వాళ్ళని జబర్దస్త్ నుండి తప్పించారని అలకబూని మల్లెమాల ప్రొడ్యూసర్స్‌ని శంకిస్తే.... నాగబాబు వెళ్ళిపోయాక మేము ఉండలేమంటూ హైపర్ ఆది, చమ్మక్ చంద్ర లాంటి వాళ్ళు వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. నాగబాబు జబర్దస్త్ జడ్జ్‌గా తప్పుకోవడమే కాదు.. మరో ఛానల్‌కి షిఫ్ట్ కూడా అయ్యాడు. జీ తెలుగు ఛానల్‌లో ఓ స్పెషల్ ప్రోగ్రాం‌తో నాగబాబు తన జబర్దస్త్ బ్యాచ్‌తో మెరవబోతున్నాడు. ఇప్పుడు జబర్దస్త్ టీం మొత్తం జీ ఛానల్‌లో సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది.

ఇక నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకోగానే రోజా పక్కన కూర్చునే జడ్జ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఏదో రెండు మూడు వారాలంటే యాంకర్స్ అనసూయ, రష్మిలను రోజా పక్కన కూర్చోబెట్టి పని కానివ్వవచ్చు కానీ.. తర్వాతైనా జడ్జ్‌గా ఎవరో ఒక సెలెబ్రిటీని తీసుకురావాల్సిందే. అయితే రోజా పక్కన కాసేపు కూర్చుని నవ్వడానికి‌గాను కమెడియన్ బండ్ల గణేష్ అయినా, లేదంటే అలీనైనా తీసుకురావాలని చూస్తున్నారట. ఇప్పటికే మల్లెమాల వారు అలీ, బండ్ల గణేష్ దగ్గరికి వెళ్లినట్లుగా టాక్. మరి భారీగా రెమ్యునరేషన్ ఇస్తే గనక అలీ గాని బండ్ల గాని ఎందుకొప్పుకోరు.



By November 18, 2019 at 04:52AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48314/nagababu.html

No comments