Breaking News

టీచరమ్మతో `వెంకీ మామ` రొమాన్స్‌.. `ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో..`!


రియల్ లైఫ్‌ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేస్‌, యువ సామ్రాట్‌ నాగచైతన్యలు రీల్‌ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తున్న సినిమా వెంకీ మామ. ఇప్పటికే టీజర్‌, సాంగ్‌తో ఆకట్టుకున్న టీం తాజాగా మరో సాంగ్ లిరికల్‌ వీడియోను రిలీజ్‌. వెంకటేష్‌, పాయల్ రాజ్‌పుత్‌ మధ్య వచ్చే డ్యూయెట్‌ ఎన్నాళ్లోకో ఎన్నాళ్లకో సాంగ్‌ను శనివారం రిలీజ్ చేశారు. Also Read: రెట్రో స్టైల్‌లో తెరకెక్కించిన ఈ పాటలో వెంకీ డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌లో అదరగొడుతున్నాడు. ఇక ఆర్‌ఎక్స్‌ 100 బ్యూటీ పాయల రాజ్‌పుత్‌ హాట్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సూపర్బ్ అనిపించింది. నాగ చైతన్యకు జోడిగా రాశీఖన్నా నటిస్తున్న ఈ సినిమాకు బాబీ దర్శకుడు. తమన్‌ సంగీత సారధ్యంలో శ్రీమణి సాహిత్యమదించగా పృద్వీ చంద్ర ఈ పాటను ఆలపించాడు. జై లవకుశ సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న యంగ్ డైరెక్టర్‌ బాబీ, ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్‌ సినిమాలో వెంకటేష్‌ అతిథి పాత్రలో కనిపించాడు. ఈ సారి మామా అల్లుళ్లు ఇద్దరు ఫుల్‌ లెంగ్త్‌ రోల్స్‌లో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. Also Read: ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌ ఆసక్తికరంగా ఉండటంతో వెంకీ, నాగచైతన్య స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు మంచి రెస్సాన్స్‌ వస్తుండటంతో హిట్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా సంక్రాంతి బరిలో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. అయితే సంక్రాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో వెంకీ మామ రిలీజ్‌ డేట్‌ విషయంలో ఆలోచనలో పడ్డారు.


By November 16, 2019 at 01:31PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/venkatesh-naga-chaitanyas-venky-mama-yennallako-song-lyrical-video/articleshow/72083018.cms

No comments