Breaking News

బెడ్‌రూమ్‌లో పనిమనిషితో రాసలీలలు.. ట్విస్ట్ ఇచ్చిన భార్య


కట్టుకున్న భార్య కళ్లుగప్పి పనిమనిషితో రొమాన్స్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధాన్ని నిలదీసినందుకు భార్యను చితకబాది నోరు మూయించాడు. అయితే భర్త తనకు చేస్తున్న అన్యాయంపై గళమెత్తిన బాధితురాలు వారిద్దరి రాసలీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సేకరించి పోలీసులకు సమర్పించింది. దీంతో ఆ భర్త ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. Also Read: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన దోన్‌గర్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ అనే వ్యక్తి భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఆర్థికంగా కాస్త ఉన్నత కుటుంబం కావడంతో ఇంట్లో పనులు చేసేందుకు ఓ మహిళను పెట్టుకున్నారు. అయితే పనిమనిషిపై కన్నేసిన ఆర్యన్ ఆమెతో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు. భార్యకు తెలియకుండా పనిమనిషికి చీరలు, వస్తువులు కొనిచ్చి పూర్తిగా తన దారిలోకి తెచ్చుకున్నాడు. Also Read: రోజూ భార్యను ఏదొక పనిమీద బయటకు పంపి పనిమనిషితో శృంగారంలో పాల్గొనేవాడు. ఆర్యన్ భార్యకు ఈ విషయం తెలిసి తనకు అన్యాయం చేయొద్దని భర్తను వేడుకుంది. అయినప్పటికీ అతడి బుద్ధి మారకపోగా మరింత రెచ్చిపోయాడు. భార్య ఎదుటే పనిమనిషితో చనువుగా ఉంటూ వేధించేవాడు. దీంతో బాధితురాలు నిలదీయగా తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశాడు. అయితే భర్త వదిలేస్తే తన పరిస్థితి ఘోరంగా తయారవుతుందన్న ఆందోళనతో ఆమె ఏమీ అనలేక బాధను భరిస్తూ వస్తోంది. Also Read: కొద్దిరోజులు అలాగే నెట్టుకొచ్చిన ఆమె భర్త ఆగడాలు ఇక సహించకూడదని నిర్ణయించుకుంది. పనిమనిషితో అతడు సాగిస్తున్న రాసలీలలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సేకరించి బంధువులకు చూపించింది. వారి సాయంతో ఓ రోజు అతడిని బెడ్రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు ఆర్యన్, పనిమనిషిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By November 12, 2019 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chhattisgarh-man-illegal-affair-with-house-servant-his-wife-caught-red-handedly/articleshow/72017041.cms

No comments