Breaking News

పూజాకు ఆ స్టార్ నచ్చేశాడట.. లవ్లీ కామెంట్స్


టాలీవుడ్‌ను ఏలుతూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది పూజా హెగ్దే. ఇప్పటికే స్టార్ హీరోల సరసన నటించి తన రేంజ్‌తో పాటు అమాంతంగా రెమ్యునరేషన్ పెంచేసుకున్న ఈ పాప వరుస ఆఫర్లతో బిజిబిజీగా గడుపుతోంది. ఒక సినిమా పూర్తవ్వక మునుపే మరో సినిమాకు సైన్ చేస్తూ బిజీహీరోయిన్‌గా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా అయినా.. హీరోయిన్‌గా పూజా హెగ్దేనే తీసుకోవాలి.. అని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారంటే ఈ ముద్దుగుమ్మ గురించి ఇంతకంటే ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు. 

ఇప్పటికే దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ భామ.. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రొమాన్స్ చేస్తోంది. ఈ కాంబోలో వస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది.. సుమారు సగం సినిమా అయిపోవచ్చింది. ఈ సందర్భంగా ఓ చానెల్ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి అడగ్గా ఆమె చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో తాను కలుసుకున్న మంచి వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరని..  ఆయన నిజాయితీగా ఉండే వ్యక్తని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన ప్రభాస్ ఎవరికైనా నచ్చేస్తారని చెప్పింది. ఆయనకు ఎప్పుడూ స్టార్ అనే ఫీలింగ్ ఉండదని.. డౌన్ టూ ఎర్త్ పర్సన్ అని పూజా పాప.. లవ్లీ కామెంట్స్ చేసింది.

అంటే ప్రభాస్.. పూజాకు పిచ్చిపిచ్చిగా నచ్చేశాడన్నమాట. ఇలా ఇంటర్వ్యూ వేదికగా తన మనసులోని మాటను ఈ స్టార్ హీరోయిన్ బయటపెట్టింది. పూజా కామెంట్స్‌ విన్న ప్రభాస్ వీరాభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. కాగా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘అల వైకుంఠపురంలో..’ పూజా నటిస్తోంది. ఈ సినిమా ఇంకా పూర్తి కాకమునుపే ప్రభాస్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది.



By November 28, 2019 at 02:30AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48456/pooja-hegde.html

No comments