Breaking News

రష్మికను ఆ బూతుతో పోల్చిన నెటిజన్, స్పందించిన నటి


ఫలానా సెలబ్రిటీ నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు, నచ్చకపోతే అసహ్యమైన కామెంట్లు పెడతూ వారిని బాధపెడుతుంటారు. తాజాగా యువ హీరోయిన్ రష్మిక మందనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల రష్మిక తన చిన్ననాటి ఫొటోను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రోల్స్ చేసే ఓ నెటిజన్ రష్మిక చిన్నప్పటి ఫొటోలను పోస్ట్ చేస్తూ వాటిపై ‘ఇంత చిన్న పిల్ల పెద్దై ఇంటర్నేషనల్ హైవే అవుతుందని ఎవరు మాత్రం ఊహించారు’ అని కామెంట్ చేశాడు. అంతేకాదు ‘f**k’ అన్న పదాన్ని కూడా వాడి పిచ్చిగా క్యాప్షన్ ఇచ్చాడు. ఇది కాస్తా రష్మిక కంట పడింది. దాంతో ఆమె నొచ్చుకున్నారు. వెంటనే అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారు. అదే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘మాలాంటి వారిపై ఇలాంటి కామెంట్స్ చేస్తే మీకు ఏమొస్తుందో మాకైతే అర్థం కాదు. మేం మీకు సాఫ్ట్ టార్గెట్ అనేగా ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన మాపై మీరు ఇంత దారుణంగా కామెంట్స్ చేయాలని కాదు. మీలో చాలా మంది ఇలాంటి కామెంట్స్ పట్టించుకోవద్దు అని చెబుతుంటారు. నేను కూడా పట్టించుకునేదాన్ని కాదు. మేం చేసే పని గురించి ఎలాంటి కామెంట్స్ అయినా చేయండి. ఎందుకంటే ఆ హక్కు మీకు ఉంది. కానీ మా పర్సనల్ జీవితాలపై కామెంట్ చేసే హక్కు మీకు లేదు. ఏ యాక్టర్ ఇలాంటి చెత్త మాటలు పడకూడదు. ఎందుకంటే యాక్టర్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ప్రొఫెషన్ ఏదైనా ప్రతీ ఒక్కరినీ గౌరవించడం నేర్చుకోవాలి. ఒకర్నొకరు గౌరవించుకోవడం నేర్చుకోండి. ఎవరైతే నా ఫొటోపై ఈ కామెంట్ చేశారో వారికి కంగ్రాట్స్. మీరు నన్ను బాధపెట్టగలిగారు. మీరు ఇలాంటి పనులు చేస్తారని అనుకోలేదు’ అంటూ బాధపడ్డారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి, సమంత, చిన్మయి శ్రీపాద వంటి సెలబ్రిటీలు కూడా ఇలాంటి సైబర్ వేధింపులను ఎదుర్కొన్నారు. పాపులారిటీ కోసం కొందరు నెటిజన్లు అసహ్యమైన కామెంట్స్ చేయడం బాధాకరం. ప్రస్తుతం రష్మిక సూపర్‌స్టార్ మహేష్ బాబుకు జోడీగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు నితిన్‌కు జోడీగా ‘భీష్మ’, అల్లు అర్జున్‌ పక్కన ‘ఐకాన్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.


By November 07, 2019 at 11:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/netizen-compares-rashmika-mandanna-to-international-highway-actress-hits-back-with-a-strong-comment/articleshow/71950079.cms

No comments