Breaking News

యువతిని రేప్ చేసి పెళ్లి చేసుకుని... సిగరెట్లతో కాలుస్తూ చిత్రహింసలు


యువతిని దక్కించుకునేందుకు మహిళపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు కేసు భయంతో ఆమెనే పెళ్లి చేసుకున్న ఘటన నోయిడాలో వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన రాహుల్(పేరు మార్చాం) అనే యువకుడు గతంలో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లగా.. ఓ యువతి పరిచయమైంది. ఆమెతో తరుచూ ఫోన్లో మాట్లాడుతూ చనువు పెంచుకున్నాడు. ఓ రోజు తన గదికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత నగ్నంగా ఫోటోలు తీశాడు. కొద్దిరోజుల తర్వాత ఆ ఫోటోలు చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: అయితే ఆ యువతి కేసు పెడితే తనకు ఇబ్బంది అని భావించిన రాహుల్.. కేసు పెట్టకుండా బాధితురాలిని బ్రతిమాలి పెళ్లి చేసుకున్నాడు. 10రోజుల పాటు బాగానే కాపురం చేసిన రాహుల్‌ తర్వాత రెచ్చిపోయాడు. భార్యను నిత్యం పెట్టాడు. సిగరెట్లతో ఆమె శరీరంపై కాలుస్తూ పైశాచికానందం పొందాడు. భర్త పెట్టే వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చిన బాధితురాలు సహనం నశించి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: నిందితుడు తనను ఎలా లోబరుకున్నదీ, పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెడుతున్న తీరును ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రాహుల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. Also Read:


By November 14, 2019 at 12:19PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/noida-man-rapes-woman-then-married-due-to-fear-of-police-then-torture-her/articleshow/72051443.cms

No comments