Breaking News

ఆ కామాంధుడిని చట్టం ముందు నిలబెడతాం.. వర్షిత హత్యపై జగన్ ఆవేదన


జిల్లా కురబలకోటలో చిన్నారి వర్షిత(5) హత్యాచారం కేసుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. వర్షిత హత్యాచారం తనను తీవ్ర కలిచివేసిందన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టొద్దని పోలీసులను ఆదేశించారు. నేరస్థుడిని వీలైనంత తర్వగా పట్టుకుని చట్టం ముందు నిలబెడతామన్నారు. Also Reead: చిత్తూరు జిల్లా కురబలకోటలోని ఓ ఫంక్షన్ హాల్ గురువారం రాత్రి జరిగిన పెళ్లికి వర్షిత తల్లిదండ్రులతో కలిసి హాజరైంది. కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతూ చుట్టుపక్కల గాలించారు. ఫంక్షన్ హాల్ వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించడంతో అంతా షాకయ్యారు. పోస్టుమార్టం నివేదికలో వర్షితపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలియడంతో అంతా షాకయ్యారు. Also Reead: నిందితుడు బాలికను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు వాటి ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. పెళ్లిలో వర్షితను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అనుసరించినట్టు సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించారు. చిన్నారితో మాట్లాడుతూ.. ఆమెకు దూరంగా తీసుకెళ్తుండటం స్పష్టంగా కనిపించింది. నిందితుడు కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడుగా అనుమానిస్తున్నారు. అతడిని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నారు. మరోవైపు వర్షిత తల్లిదండ్రులకు ఎవరితోనైనా పాత గొడవలు ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. Also Reead:


By November 10, 2019 at 12:41PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ap-cm-jagan-reactions-on-chittor-varshita-rape-and-murder-case/articleshow/71991656.cms

No comments