సినిమాల్లో ఛాన్స్‌ల పేరుతో అమ్మాయిలను హోటల్‌కి తీసుకెళ్లి...

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిలను నమ్మించి వారిని లైంగికంగా లోబచుకుంటున్న మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది నెలలుగా అనేక మంది యువతులను ఇదేవిధంగా నమ్మించి కోరికలు తీర్చుకున్న ఆ కామాంధుడి లీలలు ఓ బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చాయి. Also Read: రాజధాని బెంగళూరుకు చెందిన జహంగీర్(30) ఎంబీఏ చేశాడు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ సోషల్‌మీడియా ద్వారా ప్రచారం చేయడంతో అనేక మంది యువతులు అతడిని సంప్రదించేవారు. వారి ముందు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నాటకమాడి నమ్మించేవాడు. దాన్ని అలుసుగా తీసుకుని వారిని లైంగికంగా అనుభవించేవాడు. ఇటీవల తనకు పరిచయమైన యువతి(28)తో తన తండ్రి తమిళనాడులో ఎమ్మెల్యే అని, తల్లి డాక్టర్ అని చెప్పి నమ్మించాడు. బెంగళూరులో ఓ షాపింగ్ మాల్ కూడా ఉందని చెప్పడంతో ఆ యువతి పూర్తిగా అతడి మాయలో పడిపోయింది. Also Read: తనకు చాలామంది నిర్మాతలతో పరిచయాలు ఉన్నాయని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి ఆ యువతిని కోరమంగళలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. తర్వాతి రోజు నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయానని నిర్ధారించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. జహంగీర్ 2017 నుంచి ఈ తరహాలో మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. Also Read:
By November 24, 2019 at 01:24PM
No comments