Breaking News

అప్పుడే ఐపోలేదు.. ఇంకా చాలా ఉంది: కీర్తి సురేష్


సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే నేషనల్ అవార్డు సాధించారు ప్రముఖ నటి . తమిళ నిర్మాత సురేష్, నటి మేనక దంపతుల కుమార్తె అయిన కీర్తి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆరేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తనకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్‌కి, ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఆరేళ్ల క్రితం నేను నటిగా జన్మించాను. విభిన్నమైన పాత్రలతో ఎన్నో జీవితాలను జీవించగలిగినందుకు నేను చాలా లక్కీ. నన్ను ఆదరించి ఇంతటి ప్రేమాభిమానాలు కురిపిస్తున్నందుకు ధణ్యవాదాలు. నా కలను సాకారం చేసుకోవడానికి నా ముందున్న అవకాశాలు చూసి నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను. నా కుటుంబానికి, సినీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఫ్యాన్స్‌కి థ్యాంక్యూ. కాబట్టి మీరు ప్రశాంతంగా పాప్ కార్న తెచ్చుకుని సీట్లలో కూర్చోండి. ఎందుకంటే అప్పుడే అయిపోలేదు ఇంకా చాలా ఉంది’ అని పేర్కొన్నారు. 2000లో వచ్చిన ‘పైలట్స్’ అనే మలయాళం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి కెరీర్‌ను ప్రారంభించారు కీర్తి. 2013లో వచ్చిన ‘గీతాంజలి’ అనే మలయాళం సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తెలుగులో కీర్తి నటించిన తొలి సినిమా ‘నేను శైలజ’. ఈ సినిమాతో కీర్తి తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేశారు. అక్కడి నుంచి కీర్తి ప్రయాణం దూసుకుపోతోంది. కెరీర్‌ మొదట్లోనే అలనాటి నటి సావిత్రి బయోపిక్‌లో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాకు గానూ ఆమె జాతీయ అవార్డు కూడా వరించింది. కీర్తి ట్యాలెంట్‌కు బాలీవుడ్‌ కూడా ఫిదా అయింది. అందుకే ఆమెను ‘మైదాన్’ అనే స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా‌లో హీరోయిన్‌గా ఎంపికచేశారు ప్రముఖ నిర్మాత బోనీ కపూర్. ప్రస్తుతం కీర్తి చేతిలో ‘మరక్కర్’, ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘రంగ్ దే’, ‘గుడ్ లక్ సఖి’, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలు ఉన్నాయి.


By November 18, 2019 at 11:27AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-keerthy-suresh-thanks-fans-for-showering-so-much-of-love-as-she-completed-six-years-in-the-film-industry/articleshow/72104305.cms

No comments