‘పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తా’ నంటూ వేధింపులు.. యువకుడి అరెస్ట్

ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి పీఎస్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి(20) సికింద్రాబాద్‌లోని ఓ సూపర్మార్కెట్లో పనిచేస్తోంది. కొంతకాలం క్రితం ఆమెకు కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు బస్టాప్‌లో పరిచయమయ్యాడు. Also Read: కొద్దిరోజుల తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటా.. అంటూ శ్రీనివాస్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనకు ఇష్టం లేదని యువతి చెప్పినా వినకుండా వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు యువకుడిని మందలించారు. మరోసారి వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. Also Read: దీంతో కొద్దిరోజుల పాటు సైలెంట్‌గా ఉన్న శ్రీనివాస్ మంగళవారం యువతిని కలిశాడు. తనను పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోసేస్తానని యువతిని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By November 10, 2019 at 10:22AM
No comments