Breaking News

అపార్ట్‌మెంట్లో సెక్స్‌రాకెట్.. నలుగురు విటులు, ఆరుగురు వేశ్యల అరెస్ట్


కోల్‌కతాలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. ఓ అపార్ట్‌‌మెంట్‌లోని ఫ్లాట్‌లో బొటిక్ ముసుగులో అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు శనివారం రైడ్ చేశారు. ఈ సందర్భంగా నలుగురు విటులను అరెస్ట్ చేసి పలువురు యువతులను రక్షించారు. Also Read: సౌత్‌జోన్‌లోని కస్బా పోలీస్‌స్టేషన్ పరిధిలో నాస్కర్‌హాట్ రాయ్‌పారా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొన్నాళ్లుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఓ ఫ్లాట్‌లో నిర్వహిస్తున్న బొటిక్‌కు అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు తరుచూ వస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చింది. అక్కడికి వచ్చే యువకులు చుట్టుపక్కల మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆదివారం వారంతా ఏకమై ఆ ఫ్లాట్‌లోకి చొరబడ్డారు. Also Read: ఆ సమయంలో పలువురు అమ్మాయిలు, అబ్బాయిలు అసభ్యకర రీతిలో కనిపించడంతో లోపల వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్నారు. వారందరినీ లోపలే నిర్బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నలుగురు విటులను అరెస్ట్ చేసి ఆరుగురు సెక్స్ వర్కర్లను రక్షించారు. ఈ వ్యభిచారం నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. Also Read:


By November 26, 2019 at 12:08PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-busted-in-south-kolkata-4-men-arrested/articleshow/72236769.cms

No comments