Breaking News

భార్యకు డ్రగ్స్ ఇచ్చి ఫ్రెండ్స్‌తో రేప్ చేయించిన నీచుడు


ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ వ్యక్తి తన ఫ్రెండ్స్‌తో కట్టుకున్న భార్యపైనే అత్యాచారం చేయించి వీడియో తీసిన నీచపు ఘటన సహారాన్‌పూర్‌లో జరిగింది. అంతటితో ఆగని భర్త ఆమెకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే రేప్ వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. Also Read: సహరాన్‌పూర్‌లో నివసించే అబ్దుల్లా అనే వ్యక్తి ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లిచేసుకుంటానని చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెపై మోజు తీరాక మొహం చాటేశాడు. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఈ ఏడాది ఆగస్టు 16న ఆమె పెళ్లి చేసుకున్నాడు. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. తనను పోలీస్‌స్టేషన్‌కు ఈడ్చిందని కక్ష పెంచుకున్న అబ్దుల్లా భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. Also Read: ఈ క్రమంలోనే ఈ నెల 3వ తేదీన ఆమె తినే ఆహారంలో డ్రగ్స్ కలిపాడు. అతి తిన్నాక మత్తులోకి జారుకున్న ఆమెపై తన నలుగురు ఫ్రెండ్స్‌తో అత్యాచారం చేయించాడు. ఆ తతంగాన్నంతా తనే స్వయంగా వీడియో తీశాడు. మత్తు నుంచి తేరుకున్న బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకుని భర్తను నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన అబ్దుల్లా భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పి ఇంట్లో నుంచి గెంటేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే రేప్ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వారిని వేడుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:


By November 14, 2019 at 11:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/uttar-pradesh-man-commits-gang-rape-along-with-his-friends-case-booked/articleshow/72050539.cms

No comments