Breaking News

కొండవీడు చూసొస్తానని వెళ్లి... ప్రియుడి చేతిలో దారుణ హత్య


భర్తతో విభేదాల కారణంగా పుట్టింట్లోనే ఉంటున్న మహిళ మరొక వ్యక్తితో ప్రేమలో పడింది. అతడితో శారీరక సంబంధం పెట్టుకుని ప్రియుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. పాత గుంటూరుకు చెందిన గొట్టిపాటి ఆదిలక్ష్మి(32)కి పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. భర్తతో మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చేసి తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదిలక్ష్మి మూడు నెలల క్రితం వరకు గుంటూరులోని ఓ స్టీలు సామగ్రి దుకాణంలో పని చేసేది. ఆ సమయంలో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో తరచుగా ఫోన్‌లో మాట్లాడేది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: ఈనెల 5న కొండవీడు పర్యటనకు వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి బయటకు వెళ్లిన ఆదిలక్ష్మి రెండు రోజులైనా తిరిగిరాలేదు. దీంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీశారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు శనివారం కొండవీడు వచ్చి వెతుకుతుండగా కోట గ్రామం వైపు ఉన్న పురాతన మెట్ల మార్గంలోని దర్గా సమీపంలో ఆదిలక్ష్మి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదిలక్ష్మి కాల్‌డేటాను పరిశీలించగా ఆమె అక్రమ సంబంధం విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలక్ష్మి కొండవీడుకు ప్రియుడితో కలిసి వచ్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆదిలక్ష్మి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో చంపేసినట్లు అతడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు హత్య జరిగిన నాలుగురోజులు కావడంతో మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా మారింది. సంఘటనా స్థలాన్ని చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు, యడ్లపాడు ఎస్సై నాగేశ్వరరావు, యడ్లపాడు తహశీల్దార్‌ జి.నాంచారయ్య శనివారం సందర్శించారు. నుంచి క్లూస్‌టీం సంఘటనా స్థలంలో సాక్ష్యాధారాలను సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Also Read:


By November 10, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/guntur-woman-murdered-by-lover-over-illegal-affair-disputes/articleshow/71990127.cms

No comments