గెస్ట్‌హౌస్‌లో మైనర్ బాలికలతో వ్యభిచారం.. ఆరుగురు విటుల అరెస్ట్

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లో కొన్నాళ్లుగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో బుధవారం దానిపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు మైనర్ బాలికలకు విముక్తి కల్పించారు. Also Read: విటులు దీప్తి రంజన్ మల్లిక్, శ్రీకృష్ణ పాల్, పింటు సాహూ, రాకేశ్ సాహూ, దీపక్ మల్లిక్, గ్వాటం బెహెరాతో పాటు గెస్ట్‌హౌస్ రిసెప్షనిస్ట్ అక్షీ గోచాయత్‌ను అరెస్ట్ చేశారు. విటులంతా పట్టణ శివారు గ్రామాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. రక్షించిన బాలికల్లో నలుగురిని వారి తల్లిదండ్రులకు అప్పగించగా, మిగిలిన ఇద్దరిని శిశు సంక్షేమ కమిటీకి అప్పగించారు. అరెస్ట్ చేసిన యువకులపై అనైతిక అక్రమ రవాణా నిరోధక చట్టంలోని సెక్షన్ 3తో పాటు, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. Also Read: సంఘటనా స్థలం నుంచి ఆరు బైక్‌లు, అనేక సెక్స్ టాయ్స్, కండోమ్ ప్యాకెట్లు, పోర్న్ సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి మైనర్ బాలికలను తీసుకొచ్చి గెస్ట్‌హౌస్‌లో వ్యభిచారం చేయిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. కొందరు బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించినట్లుగా కూడా తమవద్ద సమాచారం ఉందని వెల్లడించారు. Also Read: Also Read:
By November 29, 2019 at 09:49AM
No comments